యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు, మోత్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డబ్ల్యూహెచ్వో బృందం ఆకస్మికంగా తనిఖీ చేపట్టింది. మోత్కూరు , ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వాటి పరిధిలోని ఉపకేంద్రాల రికార్డులను పరిశీలించారు. అనంతరం పాటిమట్ల ప్రాథమిక ఆరోగ్యం ఉపకేంద్రంలో రికార్డులను పరిశీలించి.. కరోనా పాజిటివ్ నుంచి కోలుకుంటున్న వారిని బృందం పరామర్శించింది.
ఆసుపత్రి పరిధిలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, మందుల సరఫరా, ఆసుపత్రిలో కాన్పులు, వ్యాధి నిరోధక టీకాలు, దీర్ఘకాలిక రోగుల వివరాలు, తదితర వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. పాటిమట్ల ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నందు వ్యాధినిరోధక టీకాల నిల్వలను పరిశీలించారు. కరోనా రోగులకు అందించే చికిత్స వివరాల గురించి తెలుసుకున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీ చేపట్టిన డబ్ల్యూహెచ్వో బృందం - phc
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు, మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డబ్లూహెచ్వో బృందం తనిఖీ చేపట్టింది. ఆస్పత్రుల్లోని రికార్డులను పరిశీలించారు. కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, తదితర వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీ చేపట్టిన డబ్ల్యూహెచ్వో బృందం
ఇవీ చూడండి: కరోనాను జయించిన 211 పోలీసులకు ఘనస్వాగతం