యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి చేతుల మీదుగా 14 మంది లబ్ధిదారులకు రూ.4.5 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. యాదగిరిగుట్ట మండల పరిధిలోని చిన్న కందుకూరు, గుండ్లపల్లి, జంగంపల్లి, మాసాయిపేట, కమటంగూడెం, పెద్ద కందుకూరు, రామాజీపేట, సైదాపురం, వంగపల్లి గ్రామాల వారికి ఎమ్మెల్యే సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీత - యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు రూ. 4.5 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి పంపిణీ చేశారు. కరోనా పరిస్థితుల్లో ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారంటూ ఎమ్మల్యే తెలిపారు.
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీత
అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే సునీత అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేశారని ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండిః ఆన్లైన్ పాఠాలతో ఫోన్ బిల్లుల మోత!