యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలారామరం మండలంలో పలు అభివృద్ధి పనులకు… ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మండలంలోని మైలారం గ్రామంలో శామీర్ పేట వాగుపై రూ.3.85 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ప్రభుత్వ విప్ - stunned for development works in bommalaramaram
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలారామరం మండలంలో... ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.

రూ. 60 లక్షలతో జడ్పీ రోడ్డు నుంచి గోవిందు తండా వరకు వయా మంచ తండా బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. సాగునీరు కోసం ముఖ్యమంత్రి... కాళేశ్వరం నుంచి ఆలేరు నియోజకవర్గానికి కాలువల ద్వారా చెరువులోకి తీసుకొచ్చి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో కృషి చేస్తున్నారన్నారు. రూ. 1.50 కోట్లతో ప్యారారం నుంచి గదిరాల తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు శంకుస్థాపన చేశారు.
అనంతరం మైలారం గ్రామంలో అనాధ పిల్లలైన వడ్లకొండ రామ్ తేజ, వడ్లకొండ క్రాంతి కుమార్కు ఒక్కొక్కరికి నెలకు రెండు వేల చొప్పున ప్రభుత్వం నుంచి మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.