తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికుల ధర్నా - yadadri bhuvangiri district news

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ చేనేత కార్మికులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. వారికి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మద్దతు తెలిపి, కార్మికులకు నెలకు 10 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్​ చేశారు.

సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికుల ధర్నా
సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికుల ధర్నా

By

Published : Jun 11, 2020, 8:00 PM IST

Updated : Jun 11, 2020, 8:06 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​ ఎదుట తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ చేనేత కార్మికులు ధర్నా నిర్వహించారు. వారికి సీపీఎం కేంద్ర కమిటీ నాయకులు చెరుపల్లి సీతారాములు మద్దతు తెలిపారు. లాక్​డౌన్​ నేపథ్యంలో నేతన్నలు చాలావరకు నష్టపోయారని ఆయన తెలిపారు. పెళ్లిళ్ల సీజన్​, రెగ్యులర్‌గా వచ్చే ఆర్డర్లు అన్నీ పోయాయని, ఒక్క తెలంగాణలోనే చేనేత కార్మికుల దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు ఉండిపోయాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత కార్మికులకు, వారి కుటుంబానికి నెలకు పదివేల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం సహాయనిధి నుంచి వంద కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చేనేత వస్త్ర నిల్వలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపచేయాలని కోరారు.

ఇవీ చూడండి: ఎస్సీ, ఎస్టీలు ఎదిగితే కేసీఆర్​ సహించరు: ఉత్తమ్​

Last Updated : Jun 11, 2020, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details