రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై... ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అందుకోసమే పార్లమెంట్‌లో నిధులు అంశానికి సంబంధించిన సమాచారం కోరామని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో పాటు అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తా: కోమటిరెడ్డి - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాగునీటి ప్రాజెక్టుల్లో వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులోనూ అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. వీటిపై ప్రధానితోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు.
mp komatireddy venkatreddy