తెలంగాణ

telangana

ETV Bharat / state

మోత్కూరులో క'నీటి' కష్టాలు - నీటి కష్టాలు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో ప్రజలు నీటి సమస్యతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మహిళలు ఖాళీ బిందెలతో మండల కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ హామీతో నిరసనను విరమించారు.

మోత్కూరులో క'నీటి' కష్టాలు

By

Published : Jun 24, 2019, 10:50 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని రాజన్న గూడెంలో గత నెల రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలోని మహిళలందరూ ఖాళీ బిందెలతో మండల కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. స్పందించిన మున్సిపల్​ కమిషనర్ సత్యనారాయణ.. నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని తెలపటం వల్ల మహిళలు ఆందోళనను విరమించారు.

మోత్కూరులో క'నీటి' కష్టాలు

ABOUT THE AUTHOR

...view details