యాదాద్రి లక్ష్మీ నరసింహుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల ఆహ్లాదం కోసం... యాడా అధికారులు వాటర్ ఫౌంటైన్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు. కొండపై నుంచి కిందకు నీరు జాలువారేలా రెండు వాటర్ ఫౌంటైన్‌లను నిర్మిస్తున్నారు. శివాలయం ఎదుట ఇటీవల మహాబలిపురం నుంచి తీసుకొచ్చిన... నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
యాదాద్రిలో భక్తుల ఆహ్లాదం కోసం వాటర్ ఫౌంటైన్‌లు - Yadadri water fountains news
యాదాద్రి లక్ష్మీ నరసింహుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల ఆహ్లాదం కోసం... యాడా అధికారులు వాటర్ ఫౌంటైన్‌ల నిర్మాణాలు చేపడుతున్నారు.
యాదాద్రిలో భక్తుల ఆహ్లాదం కోసం వాటర్ ఫౌంటైన్‌లు
శివాలయం ప్రహరీపై నంది విగ్రహాలను పొందు పరచనున్నారు. ఇందుకోసం కళాకారులు సిమెంట్‌తో విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఆలయంలోకి ప్రవేశించే మార్గంలో ఫ్లోరింగ్‌పై వాన నీరు నిలువకుండా మరమ్మతులు చేపడుతున్నారు. తూర్పు దిశ నుంచి ఆలయంలోకి ప్రవేశించే మార్గంతో పాటు దక్షిణం ఉత్తర దిశల్లోని ప్రాకారాలు, మాడవీధుల్లో కుంగిన నేల ప్రాంగణాలను చదును చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'వ్యవసాయ బిల్లులతో రైతుల జీవితాల్లో మార్పులు తథ్యం'