ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు నింపి వినియోగదారులకు సరఫరా చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పాలడుగులో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ మహిళ గత నెల 30న ఆత్మకూరులోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ కొనుగోలు చేసింది. వారం రోజులకే మంట రావడం ఆగిపోవడం వల్ల.... పరిశీలించగా సిలిండర్ నుంచి నీరు బయటపడింది. సుమారు 21.7 కిలోల నీళ్లు ఉన్నాయి.
వంటగ్యాస్ సిలిండర్‌లో నీళ్లు... అవాక్కైన మహిళ - గ్యాస్ సిలిండర్‌లో నీళ్లు నింపిన యాజమాన్యం
వంట గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌కు బదులుగా నీటిని నింపారు. సిలిండర్ కొనుగోలు చేసిన వారానికే గ్యాస్ అయిపోవడంతో ఓ మహిళ పరిశీలించగా అసలు విషయం బయట పడింది. ఈ ఘటన మోత్కూరు మండలం పాలడుగులో వెలుగుచూసింది.

వంటగ్యాస్ సిలిండర్‌లో నీళ్లు... అవాక్కయిన వినియోగదారు
ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించగా.... సిలిండర్ లీకేజీలు పరీక్షించే సమయంలో నీటిని వినియోగిస్తారని... ఆ సమయంలో సిలిండర్‌లోకి నీరు చేరి ఉండొచ్చని తెలిపారు.
వంటగ్యాస్ సిలిండర్‌లో నీళ్లు... అవాక్కైన మహిళ
Last Updated : Jul 8, 2020, 5:45 PM IST