తెలంగాణ

telangana

ETV Bharat / state

వాగులో కొట్టుకుపోయాడు.. చెట్టు సాయంతో బయటకొచ్చాడు - ONE MAN washed in the stream

చాలా రోజుల తర్వాత వాగు పొంగడం వల్ల ఆ దృశ్యాలను చూసేందుకని వచ్చాడో యువకుడు. ప్రమాదవశాత్తు ఆ వాగులో పడి కొట్టుకుపోయాడు. స్థానికుల సాయంతో 15 నిమిషాల్లోనే బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు.

వాగులో కొట్టుకుపోయాడు.. చెట్టు సాయంతో బయటకొచ్చాడు

By

Published : Oct 13, 2019, 1:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఎగువన కురిసిన వర్షానికి బిక్కేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం ఉదయం 5 గంటల సమయంలో ఆత్మకూరు మండలంలోని కొరటికల్ గ్రామానికి చేరుకుంది. ఈ ప్రాంతంలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో లేకపోయనా బిక్కేరు వాగు రావడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని చెబుతున్నారు. వాగు చాలా రోజుల తరువాత ప్రవహించడం వల్ల స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి ప్రవాహ ఉద్ధృతిని చూస్తున్నారు. కొరటికల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు వాగును చూస్తున్న సమయంలో ప్రవాహం పెరిగి కల్వర్టు పైనుంచి ఓ యువకుడు వాగులో పడిపోయాడు. సుమారు 100 మీటర్ల దూరం కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు ఓ చెట్టు ఆసరా దొరికింది. అక్కడే ఆగిపోయాడు. విషయం గమనించిన స్థానికులు 15 నిమిషాల వ్యవధిలోనే తాళ్ళ సహాయంతో యువకుడిని రక్షించారు.

వాగులో కొట్టుకుపోయాడు.. చెట్టు సాయంతో బయటకొచ్చాడు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details