వరంగల్ సెంట్రల్ జైలుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి - WARANGAL SRINIVAS REDDY
హాజీపూర్ వరుస హత్య కేసుల నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఆరు రోజుల పోలీస్‌కస్టడీ ఇవాళ్టితో ముగిసింది. పోలీసులు నిందితుడ్ని నల్గొండ కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిరిగి వరంగల్ కేంద్రకారాగారానికి తరలించారు.
వరంగల్ సెంట్రల్ జైలుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఆరు రోజుల పోలీస్ కస్టడీ అనంతరం తిరిగి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. భారీ బందోబస్తు నడుమ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక వాహనంలో నల్గొండ కోర్టులో హాజరుపరిచిన అనంతరం తిరిగి వరంగల్ కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఈనెల 8న కోర్టు ఉత్తర్వుల మేరకు రాచకొండ పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన గడువు ముగియడం వల్ల తిరిగి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
TAGGED:
WARANGAL SRINIVAS REDDY