తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరిలో స్వచ్ఛంద లాక్​డౌన్ - స్వచ్ఛంద లాక్​డౌన్

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు విస్తృతంగా నమోదవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వచ్ఛంద లాక్​డౌన్ ప్రారంభమైంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని పట్టణ మున్సిపాలిటీ పాలకవర్గం నిర్ణయించింది.

Voluntary lockdown, yadadri bhuvanagiri
Voluntary lockdown, yadadri bhuvanagiri

By

Published : May 8, 2021, 4:48 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు పట్టణంలోని వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వచ్ఛంద లాక్​డౌన్ అమలు చేస్తున్నారు.

స్వచ్ఛంద లాక్​డౌన్​కు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని మున్సిపాలిటీ అధికారులు కోరారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని ఆదేశించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:రెండో డోసు కోసం వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద జనం పడిగాపులు

ABOUT THE AUTHOR

...view details