తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్ - యాదాద్రిలో స్వచ్ఛంద లాక్​డౌన్

యాదాద్రిలో 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్ నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది.

Voluntary lockdown for 15 days in Yadadri
యాదాద్రిలో 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్​డౌన్

By

Published : Sep 12, 2020, 10:20 AM IST

వేలాదిమంది భక్తులతో, స్థానికులతో నిత్యం రద్దీగా ఉండే యాదగిరిగుట్ట పట్టణం శుక్రవారం బోసిపోయింది. రాయగిరి నుంచి వైకుంఠద్వారం వరకు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పట్టణంలో పది రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పది మంది వరకు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ప్రజారోగ్యం దృష్ట్యా ఈనెల 10 నుంచి 25 వరకు పాలకవర్గం లాక్​డౌన్​కు పిలుపునిచ్చారు.

ఈ మేరకు మెడికల్​ షాపులు మినహా అన్ని రకాల దుకాణాలు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 వరకు పనిచేస్తున్నాయి. ఆ తర్వాత వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్​ చేస్తున్నారు. జన సంచారం లేకపోవడం వల్ల రోడ్లు, వీధులన్నీ, వెలవెల బోయాయి.యాదాద్రి ఆలయానికి వచ్చిన భక్తులు వైకుంఠ ద్వారం వద్దనే మొక్కులు తీర్చుకుంటున్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి దర్శనాలు పునఃప్రారంభం.. తరలివస్తున్న భక్తజనం

ABOUT THE AUTHOR

...view details