తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించుకున్న పోచంపల్లివాసులు - lockdownr in yadadribhuvanagiri district

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్​తో మృతి చెందిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో బుధవారం రాత్రి ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో మృతి చెందాడనే అనుమానంతో పట్టణ వాసులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటించాలని నిర్ణయించారు.

voluntary lockdown at pochampally in yadadribhuvanagiri district
స్వచ్ఛందంగా లాక్​డౌన్​ విధించుకున్న పోచంపల్లివాసులు

By

Published : Jun 26, 2020, 10:02 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ప్రజలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. కరోనా నివారణకు తమ వంతుగా స్వచ్ఛంద లాక్​డౌన్ పాటించి జిల్లాలోని మిగిలిన పట్టణాలకు ఆదర్శంగా నిలిచారు పోచంపల్లి వాసులు. శని, ఆదివారం కూడా లాక్​డౌన్​ పాటించనున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని పోచంపల్లి మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు. తప్పనిసరిగా బయటకు రావాల్సి వస్తే కచ్చితంగా మాస్కు ధరించాలన్నారు. లేనియెడల రూ.1000 జరిమానా విధించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:వారికి స్మార్ట్​ఫోన్లే లేవ్- మరి ఆన్​లైన్​లో చదువెలా?

ABOUT THE AUTHOR

...view details