యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఉదయం బాలాలయంలో సుప్రభాతం సేవలు మొదలు.. లక్ష్మీ, నారసింహ సతీసమేతంగా ప్రతిష్ట మూర్తులను మేల్కొల్పి హారతి ఇచ్చారు. స్వామివారికి వేదమంత్రోచ్ఛరణలతో శ్రీ సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేన ఆరాధనతో నిత్య కల్యాణోత్సవం జరిపించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కొలుస్తూ సహస్రనామార్చన నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో లక్ష్మీ సమేత నారసింహుడ్ని పూజిస్తూ అభిషేకం అర్చనలు చేశారు. దర్శన మూర్తులకు స్వర్ణపుష్పార్చన సైతం చేపట్టారు.
యాదాద్రి బాలాలయంలో లక్ష్మీ నారసింహుడికి విశ్వక్సేన ఆరాధన - నిత్యారాధనలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య పూజలు జరుగుతున్నాయి. వేద మంత్రాలతో నారసింహుడికి విశ్వక్సేన ఆరాధనతో నిత్య కల్యాణం జరిపించారు. ఆదివారం స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.
తలనీలాల సమర్పణ, వసతి గదులు నిలిపివేత..
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా, వాహనాలను కొండపైకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ నిబంధన దృష్ట్యా, యాదాద్రికి వచ్చిన భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేపట్టిన అనంతరం క్యూ లైన్ల్కి అనుమతిస్తున్నారు. శానిటైజేషన్ చేసుకుని, మాస్కులు ధరించి, భౌతక దూరం పాటిస్తూ, భక్తులకు ఆలయాధికారులు లఘు దర్శనం కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా భక్తులకు తలనీలాల సమర్పణ, వసతి గదులు, తాత్కాలికంగా నిలిపివేశారు.