యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా అతి పురాతన ఆంజనేయ స్వామి ఆలయాన్ని తొలగించకూడదని విశ్వహిందూ, బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు అన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వచ్చి.. ఆలయాన్ని పరిశీలించారు.
'అభివృద్ధి పేరిట అతి పురాతన ఆలయాన్ని తొలగిస్తే ఊరుకోం' - విశ్వహిందూ పరిషత్ తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అతి పురాతన ఆంజనేయ స్వామి ఆలయాన్ని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు పరిశీలించారు. అభివృద్ధిలో భాగంగా అతి పురాతన ఆలయాన్ని తొలగించకూడదని అన్నారు.
!['అభివృద్ధి పేరిట అతి పురాతన ఆలయాన్ని తొలగిస్తే ఊరుకోం' Vishwa Hindu Parishad and Bajrang Dal visited Anjaneya Swamy Temple in yadadri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9051345-425-9051345-1601859354081.jpg)
Vishwa Hindu Parishad and Bajrang Dal visited Anjaneya Swamy Temple in yadadri
ఆలయాల అభివృద్ధికి సహకరిస్తాం కానీ.. పురాతన ఆలయాలను తొలగించ కూడదని వారు పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదని.. అధికారులు ఇష్టానుసారంగా తొలగింపు చర్యలకు పాల్పడితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి:'బాగా పనిచేస్తే దుబ్బాక స్థానం కాంగ్రెస్‌దే'