Vishaka Peetadhipathi: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. ఇవాళ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని... ఆయన దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు, ఆలయ ఈవో గీత ఘనంగా స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధానాలయ నిర్మాణాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని ప్రశంసించారు. గుట్టపైన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని తెలిపారు.
'శ్రీకృష్ణ దేవరాయలులా ముఖ్యమంత్రి కేసీఆర్... యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారు. ఇది ఒక అద్భుతం. ప్రజలకు, భక్తులకు ఇది ఆధ్యాత్మిక స్వర్గధామం. ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాలి. హిందూ దేవాలయాలు ఎవరి సొత్తు కాదు.. ప్రజలందరివి. యుగ యుగాలుగా శైవులు, వైష్ణవులు వైషమ్యాలతో కొట్టుకున్నారు. ఆది శంకరా చార్యులు వారు అందరూ సమానంగా చూశారు. అన్ని దేవతలా నిలయం యాదగిరిగుట్ట. అంతా మంచి జరగాలి.. అందరూ సంతోషంగా ఉండాలి.' -- స్వరూపానందేంద్ర స్వామి