తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల కోసం చెరువు వద్దకు గుంపులుగా గ్రామస్థులు - LOCK DOWN RULES VIOLATION

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చెరువులో మత్సకారులు చేపలు పడుతున్నారు. విషయం తెలిసిన గ్రామస్థులు లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి గుంపులుగా చెరువు వద్ద బారులు తీరారు.

చేపల వేటలో మత్సకారులు... గుంపులుగా చేరిన జనం
చేపల వేటలో మత్సకారులు... గుంపులుగా చేరిన జనం

By

Published : Apr 12, 2020, 7:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం దిలావర్​పూర్ గ్రామ చెరువులో మత్స్యకారులు చేపలు పట్టారు. చేపల కోసం వివిధ గ్రామాల ప్రజలు చెరువు వద్దకు గుంపులుగా చేరుకుని లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిను లాక్ డౌన్ నేపథ్యంలో నిబంధనలు తుంగలో తొక్కారు. చెరువు వద్ద జనం గుంపులుగా చేరారనే సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. చేపలు కావాలనుకున్న వారిని క్రమ పద్ధతిలో నిల్చొబెట్టారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details