తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరూ కలిశారు.. ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు - పేద కుటుంబానికి ఆర్థిక సాయం

కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి అండగా నిలిచారు గ్రామస్థులు. కష్టకాలంలో ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా జానకిపురం గ్రామవాసి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నిరుపేద కుటుంబానికి రూ.25 వేలను అందజేశారు.

financial help
గ్రామస్థుల ఆర్థిక సాయం

By

Published : Dec 30, 2020, 8:10 PM IST

రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన వారికి ఆర్థికసాయం అందించారు గ్రామస్థులు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం జానకిపురం గ్రామానికి చెందిన గద్దగూటి సంతోశ్​(30) ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆసరాగా ఉన్న వ్యక్తి ఆకాల మరణం ఆ కుటుంబంలో తీవ్ర వేదనను మిగిల్చింది.

ఈ నెల 26న సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతిచెందాడు. అతనికి వికలాంగురాలైన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన గ్రామస్థులు, తెరాస కార్యకర్తలు రూ.25 వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.

ఇదీ చూడండి:గొల్లపల్లి లొల్లిలొల్లి: తెరాస, భాజపా వివాదం.. పోలీస్‌స్టేషన్​లో ఉద్రిక్తం

ABOUT THE AUTHOR

...view details