యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామంలోని బీకేరు వాగు నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇసుకను తరలిస్తున్న కాంట్రాక్టర్‌ను గ్రామస్థులు అడ్డుకున్నారు. గత మూడు నెలల క్రితం ప్రభుత్వ అనుమతులతో ఇసుకను తరలిస్తున్న ఎల్ అండ్ టీ కంపెనీ వారిని గ్రామస్థులు అడ్డుకున్నారు. అప్పుడు 14మంది గ్రామస్థులపై కేసు నమోదు కావడం వల్ల వాగు నుంచి ఇసుక తరలించవద్దని వారు కోర్టును ఆశ్రయించారు. గ్రామస్థుల వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
కంపెనీ వారు తిరిగి వాగు నుంచి ఇసుక తరలించడానికి ప్రయత్నించగా వాగు నుంచి ఇసుకను తరలిస్తే వాగు పరిసర ప్రాంతంలో ఉన్న బోరు బావులు ఎండిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గ్రామస్థులు అడ్డుకున్నారు. దానికితోడు గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడుతుందని దయచేసి ఇసుకను తరలించవద్దని గ్రామస్థులతో కలిసి సర్పంచ్ గోపాల్‌దాస్ బిక్షమమ్మ కంపెనీ వారిని వేడుకున్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై రాజు వాగువద్దకు చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలపడం వల్ల గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్థులు - yadadri bhuvanagiri district news
బీకేరు వాగు నుంచి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇసుకను తరలిస్తున్న కాంట్రాక్టర్‌ను బండకొత్తపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బోరుబావులు ఎండిపోతాయని గ్రామస్థులతో కలిసి గ్రామ సర్పంచ్ వారిని వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం వల్ల గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇసుక తరలింపును అడ్డుకున్న గ్రామస్థులు
ఇవీ చూడండి:తెలంగాణ లాక్డౌన్లో వీటికి మినహాయింపులు