తెలంగాణ

telangana

ETV Bharat / state

'చదువుతో పాటు పరిశోధనలో ముందుండాలి' - telangana news

వైద్య విద్యార్థులు చదువుతో పాటు పరిశోధనలో ముందుండాలని బీబీనగర్ నిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఫిజియాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి వర్చువల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Vikas Bhatia, Director, Bibinagar NIMS
'చదువుతో పాటు పరిశోధనలో ముందుండాలి'

By

Published : Feb 23, 2021, 11:07 AM IST

మంచి సూక్ష్మజీవి, పోషణ, శారీరక, మానసిక క్షేమం ప్రభావం అనే అంశంపై... జాతీయ స్థాయిలో నిర్వహించిన వర్చువల్ సెమినార్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ నిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా పాల్గొన్నారు. వైద్య విద్యార్థులు పరిశోధనలో ముందుండాలని కోరారు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఫిజియాలజీ విభాగంలో పనిచేసే అధ్యాపకులు మరిన్ని మెళకువలు నేర్చుకోవచ్చని తెలిపారు.

పుదుచ్చేరి జిప్ మర్ డీన్ డాక్టర్ జీకే పాల్, కళ్యాణి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంజీ సింగ్, నాగపూర్ ఎయిమ్స్ డీన్ డాక్టర్ మృణాల పతక్, డాక్టర్ దేవరాజ్‌, డాక్టర్ రోహన్ రెడ్డి తదితరులు సంబంధిత అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎయిమ్స్ డీన్ నీరజ్ అగర్వాల్, ఏఎంఎస్ కళ్యాణి, ఫిజియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ నితిన్ అశోక్ జాన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:స్మార్ట్‌ ఫోన్‌ స్క్రీన్‌పై ఎక్కువ కాలం తుంపర్లు!

ABOUT THE AUTHOR

...view details