యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో... దుర్గాయూత్ (Druga youth) ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు (Vijaya Dashami celebrations). దుర్గాయూత్ ఏర్పాటు చేసి 25ఏళ్లు పూర్తైన సందర్భంగా కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
Vijaya Dashami celebrations: దుర్గాయూత్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి వేడుకలు - తెలంగాణ వార్తలు
సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో విజయదశమి (Vijaya Dashami celebrations) నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గాయూత్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Dashami
నవరాత్రి వేడుకల సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత25 ఏళ్లుగా విజయదశమి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. దుర్గాయూత్ ఆధ్వర్యంలో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సర్పంచ్ కురిమిద్దె కళమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు గడ్డం రాములమ్మ, గ్రామస్థులు, యూత్‌కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Bathukamma in Uganda: ఉగాండాలో ఘనంగా బతుకమ్మ సంబురాలు