తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా కంఠ మహేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠాపన - KANTA MAHESHWARA SWAMY

పోతురాజుల విన్యాసాల మధ్య యాదాద్రి భువనగిరి జిల్లాలో బోనాల జాతర కన్నుల పండువగా నిర్వహించారు. జాతరకు పోలీసులు పటిష్ఠ భద్రత చేపట్టారు.

డప్పు చప్పుల్లు, శివసత్తుల నృత్యాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ

By

Published : Apr 28, 2019, 12:04 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బోనాల ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పోతురాజుల విన్యాసాల మధ్య బోనాల జాతర కన్నుల పండువగా జరిపించారు. భక్తులు భారీ సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగింది. డప్పు చప్పుల్లు, శివసత్తుల నృత్యాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details