విశ్వక్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ పంచ నారసింహుల ఆలయం అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. కొండపైన ప్రధానాలయం, గర్భాలయం, మాఢవీధులు, అష్టభుజ మండప ప్రాకారాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. సాలహారాలు, కృష్ణ శిలతో చేసిన రాతి విగ్రహాలు, ధార్మిక సాహిత్య, భారతీయ ఇతిహాస ఘట్టాలు, గర్భాలయ ప్రవేశ ద్వారంపై ప్రహ్లాద చరితం దర్శనమిస్తున్నాయి.
యాదాద్రిలో చూపరులను కట్టిపడేసే శిల్ప సౌందర్యం - యాదాద్రి ఆలయం వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి నారసింహుని ఆలయం సుందరంగా నిర్మితమవుతోంది. భక్తి పారవశ్యం రెట్టింపయ్యేలా మాఢ వీధులు, ఉప ఆలయాలు అద్భుత శిల్ప కళా సంపదతో రూపుదిద్దుకుంటున్నాయి. సాంకేతికత సాయంతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణలు కనువిందు చేస్తున్నాయి.
ఆలయ ముఖమండపంలో ఉప ఆలయాలు, ఆళ్వారుల విగ్రహాలు, అద్భుత శిల్ప కళా సంపదతో ఉట్టిపడుతున్నాయి. పసిడి వర్ణంతో(ఇత్తడి గ్రిల్స్) క్యూలైన్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సరికొత్త లైటింగ్ టెక్నాలజీతో శాండిలియార్, ప్రత్యేక విద్యుత్ దీపాల అలంకరణతో యాదాద్రి మరింత శోభను సంతరించుకుంది. భక్తులను ఆకర్షించే విధంగా బహు సుందరంగా ఆలయం నిర్మితమవుతోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చదవండి:పెట్రో, గ్యాస్ ధరలతో ప్రజల జీవితాల్లో చీకట్లు: చాడ