ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్డీ విద్యార్థి నర్సయ్య కుటుంబాన్ని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పరామర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పాలడుగు గ్రామానికి చెందిన నర్సయ్య అనే విద్యార్ధి ఓయూలో పీహెచ్డీ చేస్తున్నాడు. ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో.. నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన వీహెచ్ - Congress Leader V Hanumanth rao
ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత వీహెచ్ పరామర్శించారు.
విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన వీహెచ్
విషయం తెలుసుకున్న వీహెచ్.. నర్సయ్య ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ సక్రమంగా చేపట్టకపోవడం వల్లే ఇలాంటి మరణాలు జరుగుతున్నాయని వీహెచ్ ఆరోపించారు.