తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ నెల 23న యాదాద్రీశునికి లక్ష పుష్పార్చన - laksha pushparchana in yadadri

రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా వైరస్​ వ్యాప్తి నివారణకు యాదాద్రి నారసింహునికి లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 23న ఈ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

venerations with one lakh flowers to lord lakshmi narasimha swamy
యాదాద్రీశునికి లక్ష పుష్పార్చన

By

Published : Apr 19, 2021, 5:14 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు లోక కల్యాణార్థం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి లక్ష పుష్పార్చన, ప్రత్యేక పూజలు చేయాలని దేవస్థానం నిర్వహించింది. ఈ నెల 23న ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు బాలాలయంలో వివిధ రకాలైన లక్ష పూలతో పూజలు నిర్వహిస్తామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్​ విస్తృతంగా వ్యాపిస్తున్నందున ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ వేడుకలో పాల్గొనేందుకు భక్తులకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు.

దైవ దర్శనానికి భక్తుల రద్దీ

ఇదీ చదవండి:కొందరి నిర్లక్ష్యం.. మరికొందరికి ప్రాణసంకటం

ABOUT THE AUTHOR

...view details