యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కూరగాయల వ్యాపారులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. వీరికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ప్రతి బుధవారం జరిగే వారాంతపు సంతకు... తుర్కపల్లి, మాదాపూర్ నుంచి వ్యాపారులు కూరగాయలు తీసుకొచ్చారు. కొనేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకు కూడా పోలీసులు అవగాహన కల్పించారు.
నిబంధనలకు విరుద్ధంగా సంత.. పోలీసుల కౌన్సిలింగ్ - లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కూరగాయల వ్యాపారులు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి కూరగాయలు అమ్మేందుకు సంతకు వచ్చిన వ్యాపారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొనేందుకు వచ్చిన ప్రజలకు కూడా అవగాహన కల్పించి అక్కడి నుంచి పంపించారు.
నిబంధనలకు విరుద్ధంగా సంత.. పోలీసుల కౌన్సిలింగ్