తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఉత్సవసేవలో వేద పారాయణీకులు - Yadadri latest news

యాదాద్రి క్షేత్ర ప్రాశస్త్యం, ప్రాధాన్యతల పెంపునకు ఉత్సవాల నిర్వహణ అవసరం. ఉత్సవాల విశిష్టతకు వేద, మంత్ర పారాయణాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలోనే స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడుగురు ఆలయ వేదపండితులు చతుర్వేదాలను పఠించారు.

యాదాద్రి
యాదాద్రి

By

Published : Mar 25, 2021, 7:01 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడుగురు ఆలయ వేదపండితులు 'చతుర్వేదాల'ను పఠిస్తూ నిత్య సేవలందించారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అదర్వణ వేద పఠనం నిర్వహించి ఆధ్యాత్మికతకు బాటవేశారు. నిరంతర పారాయణం కోసం రప్పించిన 40 మంది పారాయణీకులను రప్పించారు.

వీరు విష్ణుపురాణం, రామాయణం, భారతం, భాగవతం, సుదర్శన శతకం, నరసింహ ఉపనిషత్తు, విష్ణు సహస్రనామ స్తోత్రం, దివ్యప్రబంధ పఠనం చేశారు. ప్రత్యేక ఆరాధనలు, అలంకారోత్సవాలతో పాటు ఈ పర్వాలు సకల దేవతలను పరవశింపజేశాయని ఆధ్యాత్మిక వక్తలు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details