ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో వైభవంగా నిర్వహిస్తున్న వరుణ యాగం ముగిసింది. వర్షాలుసమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 5 న ప్రారంభించిన వరుణయాగం ఇవాళ పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. నిత్యరాధన, నిత్యస్థాపిత, దేవత హోమాలు, అభిషేకాలు, బిల్వాపత్రార్చన బలిహారణంతో అత్యంత వైభవంగా పరిసమాప్తి పలికారు ఆలయ అర్చకులు. వేదమంత్రాలు మంగలవాద్యాల నడుమ అత్యంత వైభవంగా వరుణయాగం నిర్వహించారు.
యాదాద్రిలో ముగిసిన వరుణయాగం - యాదాద్రిలో ముగిసిన వరుణయాగం
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని యాదాద్రిలో వైభవంగా నిర్వహించిన వరుణయాగం ఈరోజుతో ముగిసింది.
Varunayagam ended in Yadadri