తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరాడంబరంగా యాదాద్రి వార్షిక జయంత్యుత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. లాక్​డౌన్ కారణంగా కొంతమంది ఆలయ అర్చకుల మధ్యే ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు.

vaarshika jayanthi celebrations started
నిరాడంబరంగా యాదాద్రి వార్షక జయంత్యుత్సవాలు

By

Published : May 24, 2021, 11:49 AM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో వార్షిక జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. లాక్​డౌన్ కారణంగా భక్తులెవరినీ అనుమతించట్లేదని ఆమె అన్నారు. మొదటి రోజు జయంతి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ, ఋత్విక్వరణము పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం స్వామి వారిని పరవాసుదేవ అలంకారంలో గరుడ వాహనంపై బాలాలయంలో ఊరేగించినట్లు వివరించారు.

పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం, మంత్ర పటణాల మధ్య పుట్ట మట్టితో నవ ధాన్యాలను నాటి వేడుకలకు అంకురార్పణ చేశారు. యాగశాలలో ఈ పర్వాలను జరిపారు. ఆళ్వారులలో ప్రథములైన నమ్మాళ్వార్​ల తిరునక్షత్రోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదటి రోజు చేపట్టిన వేడుకల్లో ఆలయ ఈవో గీత, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలోనూ స్వామి వారి జయంతి ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్​డౌన్​ అమలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details