యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు.
యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న వంటేరు ప్రతాప్ రెడ్డి
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న వంటేరు ప్రతాప్ రెడ్డి
చరిత్రలో నిలిచిపోయే విధంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారని కేసీఆర్ని కొనియాడారు. ముఖ్యమంత్రి చరిత్రలో చిరంజీవిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, గందమల్ల త్వరగా పూర్తయి తెలంగాణ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందాలని కోరుకుంటున్నట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు.
ఇవీ చూడండి: పశువైద్యురాలి ఘటన మరవకముందే...