Vaikunta Ekadashi Celebrations At Yadadri: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నద్ధమవుతోంది. పునర్ నిర్మితమైన దివ్యాలయంలో వచ్చే నెల 2న.. తొలిసారి వైకుంఠద్వార దర్శనోత్సవం నిర్వహణకు దేవస్థానం నిర్ణయించింది. దైవ దర్శనం, ఆరాధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు నుంచే వార్షిక అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదాద్రి ముస్తాబు - యాదాద్రిలో వైకుంఠ ద్వార దర్శనం
Vaikunta Ekadashi Celebrations At Yadadri : యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సన్నద్ధం అవుతోంది. పునర్ నిర్మితమైన దివ్యాలయంలో వచ్చే నెల 2న తొలిసారి వైకుంఠ (ఉత్తర) ద్వార దర్శనోత్సవం నిర్వహణకు దేవస్థానం నిర్ణయించింది. దైవ దర్శనం, ఆరాధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు నుంచే వార్షిక అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
వైష్ణవాచారంగా కొనసాగే ఆలయాల్లో అధ్యయనోత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందస్తుగా ఈ విశిష్ట పర్వాలను నిర్వహించడం క్షేత్ర సంప్రదాయం. వచ్చే నెల 2 నుంచి ఆరు రోజులపాటు కొనసాగే ఉత్సవాల్లో అలంకార సేవలతోపాటు ప్రబంధ పఠనం నిర్వహిస్తారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జనవరి 27 నుంచి మూడు రోజులపాటు అధ్యయనోత్సవాలు, అదే నెల 31 నుంచి వారం రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఇవీ చదవండి:
TAGGED:
yadadri latest news