తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనమిచ్చిన నరసింహస్వామి - వైకుంఠ ఏకాదశి వార్తలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో నరసింహస్వామి లక్ష్మీసమేతుడై భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

vaikunta ekadasi celebration in yadadri temple
యాదాద్రిలో నరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం..

By

Published : Dec 25, 2020, 9:57 AM IST

యాదాద్రిలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడయ్యారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వైకంఠ ద్వార దర్శనం ఇస్తున్నారు. ఉదయం 6:43 నుంచి ఉదయం 9:30 గంటల వరకు స్వామి దర్శనమిచ్చారు.

యాదాద్రి అనుబంధంగా ఉన్న పాతగుట్టలోనూ స్వామి వారు ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. ఆలయంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలు రద్దు చేశారు.

స్వామివారు వైకుంఠ ద్వారదర్శనం ఇస్తుండటంతో స్థానికులతో పాటు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. భక్తులు నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి.

యాదాద్రిలో నరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం..

ఇదీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details