యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో చేపట్టిన భూసేకరణలో భాగంగా తమకు ఉపాధి కల్పించే బండరాయి కోల్పోయామని గుట్టకు చెందిన వడ్డెర కార్మికులు ఆందోళన నిర్వహించారు. యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
తమ డిమాండ్ల సాధన కోసం యాదగిరిగుట్ట తహసిల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. న్యాయం జరిగే వరకు నిరహార దీక్షలు కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు.
మూడో రోజుకు చేరిన వడ్డెర కార్మికుల రిలే నిరాహార దీక్ష - యాదాద్రి దేవస్థానం
యాదగిరిగుట్టలోని ఓ బండరాయిని అధికారులు తొలగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతిందని గుట్టకు చెందిన వడ్డెర కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే తమకు ప్రత్యమ్నాయం ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
మాకు న్యాయం జరిగే వరకు నిరహార దీక్షలు కొనసాగిస్తాం : బాధితులు
ఇవీ చూడండి : గ్రామీణులకు సేవ చేస్తాం: యువ ఐపీఎస్ల అంతరంగం