యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో వేగంగా సూపర్ స్ప్రెడర్ల జాబితా తయారు చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సూపర్ స్ప్రెడర్స్ అయిన దుకాణ యజమానులు, మటన్, చికెన్, ఫిష్, కూరగాయల మార్కెట్ , పండ్ల మార్కెట్, హోటల్ యజమానులు వివరాల నమోదు కార్యక్రమాన్ని మున్సిపాలిటీ సిబ్బంది పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ కమిషనర్ మహమూద్ షేక్ పరిశీలించారు.
వేగంగా సూపర్ స్ప్రెడర్ల వివరాలు నమోదు - Telangana news
ప్రభుత్వ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో సూపర్ స్ప్రెడర్ల జాబితా తయారు చేశారు. వివరాలు నమోదు చేసిన వారికి త్వరలో టీకాలు వేస్తామని మున్సిపాలిటీ కమిషనర్ మహమూద్ షేక్ తెలిపారు.
Vaccination to super spiders in Yadadri Bhuvanagiri district
వివరాలు నమోదు చేసుకున్న వారికి.. టీకా వేసుకునే తేదీ, సమయం చరవాణికి మెసేజ్ వస్తుందని ఆయన తెలిపారు. మెసేజ్ వచ్చిన వారికి స్థానిక ఉన్నత పాఠశాలలో టీకాలు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చుడండి: మల్కాజిగిరి డీసీపీ తీరుపై ఎమ్మెల్యే సీతక్క ఆవేదన