యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ మండలం కొండమడుగు, జిల్లా కేంద్ర ఆసుపత్రి, చౌటుప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొత్తం 1,150 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున మొత్తం 90 మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
యాదాద్రి జిల్లాలో మూడుకేంద్రాల్లో వ్యాక్సినేషన్: కలెక్టర్ - Vaccination at three centers in Yadadri district
యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపటి నుంచి ఆరోగ్య సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడు కేంద్రాలకు కొవిడ్ టీకాను తీసుకు వెళ్లే వాహనాలను కలెక్టర్ అనితా రామచంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు. రేపు ఉదయం 10:30 నిమిషాలకు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుందని వెల్లడించారు.
'జిల్లాలో మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ'
టీకా వేయనున్న నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. అందుకోసం వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలో వైద్య సిబ్బంది ట్రైనింగ్ తీసుకుని ఉన్నారని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత వారిని వెంటనే ఇంటికి పంపకుండా అబ్జర్వేషన్లో ఉంచుతామని అన్నారు. వ్యాక్సిన్ వేసే కేంద్రాల్లో 108 వాహనంతోపాటు, అన్ని సదుపాయాలు కల్పించినట్లు వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ టీకా రేపు ఉదయం వేయనున్నట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ వివరించారు.
ఇదీ చూడండి :'వ్యాక్సిన్ వారికి ఇవ్వట్లేదు'