లాక్డౌన్ కారణంగా భక్తులకు అనుమతి లేకుండానే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారికి అర్చకులు నిత్య కల్యాణం చేస్తున్నారు. సాయంత్రం వేళ ఆండాళ్ అమ్మవారి ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అనంతరం అమ్మ వారికి ప్రీతి పాత్రమైన ఊంజల్ సేవ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముత్యాల పల్లకిపై అలంకృతమైన అమ్మవారిని ఆరాధిస్తూ పూజారులు హారతి నివేదించారు. ఆస్థాన విద్వాంసులు సన్నాయి వాయిస్తుండగా.. మేళ తాళాల మధ్య అమ్మవారికి నివేదన సమర్పించారు.
Yadadri temple: ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం - యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉంజల్ సేవా మహోత్సవం
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈ రోజు సాయంత్రం అమ్మవారిని ఆండాళ్ అమ్మవారి రూపంలో అలంకరించారు. అనంతరం ఊంజల్ సేవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవా మహోత్సవం
వేకువజామునే స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఆరాధిస్తూ హారతి ఇచ్చారు. నిత్య పూజలతో పాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. అనంతరం బాలాలయంలో ఆర్జిత పూజలు చేపట్టారు. ఉత్సవమూర్తులకు పాలాభిషేకం, తులసి అర్చన చేశాక... దర్శన మూర్తులకు స్వర్ణ పుష్పాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి