Union Minister visits Bibi Nagar AIIMS: భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ సందర్శించారు. ఎయిమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియోగ్రఫీ, అధునాతన అల్ట్రా సోనోగ్రఫీ విభాగాలను ప్రారంభించారు. ఓపీ విభాగంలో రోగులతో ముచ్చటించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను గురించి ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు.
ఎయిమ్స్ అధికారిక లెటర్‌ని కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎయిమ్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.