యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రం నుంచి మోత్కూర్- జీడికల్కు వెళ్లే రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అఖిలపక్షం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్- హైదరాబాద్ 163 జాతీయ రహదారి గుండా జీడికల్ వెళ్లే మార్గంలో నిత్యం వేలాది మంది అవసరాల కోసం ఆలేరు- హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించకపోవడం వల్ల గతంలో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారని అఖిలపక్ష నాయకులు బీర్ల ఐలయ్య తెలిపారు.
'అండర్ పాస్ బ్రిడ్జ్ వెంటనే పూర్తి చేయాలి' - మోత్కూర్- జీడికల్ అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం న్యూస్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రం నుంచి మోత్కూర్- జీడికల్కు వెళ్లే రోడ్డు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అఖిలపక్షం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
'అండర్ పాస్ బ్రిడ్జ్ వెంటనే పూర్తి చేయాలి'
భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి... కేంద్ర నిధుల నుంచి రూ.37 కోట్లు వెచ్చించినా.. అండర్ పాస్ పనులకు టెండర్లు పిలవలేదని అన్నారు. ఇప్పటికైనా... అధికారులు స్పందించి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.