తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చుట్టూ భూగర్భ డ్రైనేజీ పనులను వేగవంతం చేశారు.

By

Published : Jan 24, 2020, 10:34 AM IST

yadadri temple
యాదాద్రి ఆలయంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు

యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి ప్రధాన ఆలయం చుట్టూ భూగర్భ డ్రైనేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం లోపల నుంచి వచ్చే వ్యర్థ జలాలు బయటకు వెళ్లేలా ప్రత్యేక భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్​లను నిర్మిస్తున్నారు.

ప్రధాన ఆలయం ఆవరణలో వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా ప్రత్యేక భూగర్భ మురుగు కాలువలను నిర్మిస్తున్నారు. పడిన వర్షం నీరు నిలవకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టామ్ వాటర్, డ్రైనేజీ లైన్​లను ఏర్పాటు చేస్తున్నారు. శివాలయంలో కూడా భూగర్భ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి.

యాదాద్రి ఆలయంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు

ఇవీ చూడండి: దావోస్​లో కేటీఆర్​ బిజీ.. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details