ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం - యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు వార్తలు
10:40 August 19
ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం
యాదాద్రి భువనగిరి జిల్లాలో మామ, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఇంటిలో ఉరేసుకుని మామ భరతయ్య(60), కోడలు మానస(27) బలవన్మరణానికి పాల్పడ్డారు. మోటకొండూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కుటుంబంలో గొడవ జరగడం వల్ల మనస్తాపం చెందిన కోడలు మానస (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భయాందోళనకు గురైన మామా మారయ్య(55)కూడా బలవన్మరణం చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి :లారీని ఢీకొన్న అంబులెన్స్... ఇద్దరు మృతి