కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఇద్దరికి గాయాలు - accident
యాదగిరిగుట్టలోని ప్రధాన రహదారిపై కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదగిరిగుట్టలోని పాత సినిమా థియేటర్ వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి పంపించారు.
ఇవీ చూడండి: అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం