యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసి ఆస్తులను దోచుకోవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై కేసీఆర్ మొండి వైఖరితో.. కార్మికులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
'ఆర్టీసీ కార్మికుల కోసం నిరాహార దీక్షకు సిద్ధం' - tsrtc strike update
యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించాలని... లేకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
'ఆర్టీసీ కార్మికుల కోసం నిరాహార దీక్షకు సిద్ధం'