యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ మనసు మారాలని కొండపైకి పాదయాత్రగా వెళ్లారు. మహిళా కమాన్ నుంచి సన్నిధి వరకు మోకాళ్లపై నడిచారు. లక్ష్మీనరసింహస్వామికి వినతిపత్రం అందించారు. సీఎం కేసీఆర్ మనసు మార్చి... తమ సమస్యలు తీర్చేలా చేయాలని స్వామివారిని కోరుకున్నట్లు కార్మికులు తెలిపారు.
'నరసింహ స్వామీ... సీఎం మనసు మార్చు' - TSRTC STRIKE LATEST NEWS IN TELUGU
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మార్చు స్వామి అంటూ యాదగిరి గుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై యాదాద్రికి చేరుకున్నారు. నారసింహునికి వినతిపత్రం సమర్పించారు.
TSRTC EMPLOYEES STRIKE IN YADHAGIRIGUTTA IN DIFFERENT WAY
అంతకుముందు పాదయాత్ర చేస్తూ... ఆర్టీసీని కాపాడేందుకే సమ్మె చేస్తున్నామని స్థానికులకు, బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కరపత్రాలు పంచుతూ వివరించారు.
ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్ కల్యాణ్
Last Updated : Nov 21, 2019, 3:30 PM IST