ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు యాదగిరిగుట్ట డిపో ముందు ధర్నా నిర్వహించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటారన్న సమాచారంతో కార్మికుల ఇంటి వద్దనే పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనాల్లో పీఎస్ తరలించడాన్ని నిరాకరించారు. అనంతరం కార్మికుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నాకు దిగారు. డిపో నుంచి బయటకు వెళ్తున్న బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా అరెస్టు చేశారు. బస్సులను నడుపేందుకు అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
బస్సు రోకోలో అఖిలపక్షం నేతల అరెస్టు... - TSRTC STRIKE UPDATES
యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్షం నేతలు బస్సు రోకో కార్యక్రమం నిర్వహించారు. బస్సులను అడ్డుకున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
TSRTC EMPLOYEES ARREST AT YADHAGIRIGUTTA