కరోనా వైరస్ నిర్మూలనకు ఔషధం వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సూచించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో 20 మంది దాతల సహకారంతో తెరాస ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 11 వేల కుటుంబాలకు 10 రకాల నిత్యావసర సరకుల కిట్లను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు విధిగా భౌతిక దూరం పాటించాలని కోరారు.
తెరాస ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - grocery distributed by trs at choutuppal
కరోనా వ్యాప్తి నిర్మూలనకు స్వీయ నియంత్రణ ఒక్కటే శ్రీ రామ రక్ష అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో తెరాస ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెరాస ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి జెడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు, పీఏసీఎస్ ఛైర్మన్ దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ