పార్టీ సభ్యత్వ నమోదు కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కోరారు. భువనగిరి పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
'రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి' - ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తాజా వార్తలు
భువనగిరి పట్టణంలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో పాటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కోసం, రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలు విస్తృతంగా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీర్చిదిద్దుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మించి ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మార్చి నెలలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. స్థలం ఉంటే ఆ స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా సభ్యత్వ నమోదు సెక్రటరీ ఇంఛార్జి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఇదీ చూడండి:'సేవాలాల్ మహరాజ్ హిందువులందరికీ ఆదర్శం'