తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే కరోనా నుంచి కోలుకోవాలని పూజలు - యాదగిరిగుట్టలో తెరాస నాయకుల పూజలు

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి కరోనా నుంచి కోలుకోవాలని తెరాస నాయకులు పూజలు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు.

ఎమ్మెల్యే కరోనా నుంచి కోలుకోవాలని పూజలు
ఎమ్మెల్యే కరోనా నుంచి కోలుకోవాలని పూజలు

By

Published : Jul 8, 2020, 7:54 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి , డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెరాస నాయకులు పూజలు చేశారు.

ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురైన వారి ప్రియతమ నాయకులు కోలుకోవాలని లక్ష్మీ నరసింహస్వామికి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించారు. అదేవిధంగా యాదగిరిగుట్ట పట్టణంలో గల ముస్లిం సోదరులు తమ ప్రియతమ నాయకులు ఇరువురు త్వరగా కోలుకోవాలని.. ఈ వ్యాధి తొందర్లోనే ఈ ప్రపంచం నుంచి దూరం కావాలని కోరుకుంటూ స్థానిక మసీదులో నమాజ్ చేశారు.

ఇవీ చూడండి:ప్రైవేట్​లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details