కరోనా బారిన పడి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను దాతలు ముందుకొచ్చి ఆదుకుంటున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరుకు చెందిన రావుల వెంకన్న ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నాడు. అనంతరం కొద్ది రోజులకే బ్లాక్ ఫంగస్ సోకి మృతి చెందాడు. అతడి భార్యకూ కరోనా సోకగా.. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాదరి కిశోర్.. స్థానిక తెరాస నేతల సాయంతో బాధిత కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.
కొవిడ్ బాధితులకు తెరాస నేతల ఆర్థిక సాయం - యాదాద్రి కరోనా కేసులు
కరోనా విపత్కర పరిస్థితుల్లో పలువురు దాతలు వివిధ రూపాల్లో సహాయం అందిస్తూ.. తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరులో బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆర్థిక సాయం అందజేశారు.

Financial assistance to covid victims
పట్టణంలో కరోనా బారిన పడిన మరో ఇద్దరు ఫొటోగ్రాఫర్లకు కుడా నేతలు రూ. 6 వేలను అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ సావిత్రి మేఘారెడ్డి, వైస్ ఛైర్మన్ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:Corona : కేబీఆర్ పార్కు వద్ద శునకాలకు కరోనా లక్షణాలు