తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ మందుల సామేల్ తన ఇంటిపై పార్టీ జెండాను ఎగరవేశారు. తెలంగాణ సాధనకు అహర్నిశలు పోరాడిన పార్టీ కార్యకర్తలను సన్మానించారు. ఈ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామంలో జరిగింది.
కేసీఆర్ నాయకత్వంలో స్వంత రాష్టం కోసం తెరాస 14 సంవత్సరాలు పోరాటం చేసిందని సామేల్ అన్నారు. గడిచిన ఏడేళ్లలో పేదల మనిషిగా సీఎం కేసీఆర్ ప్రజల మనస్సులను చూరగొన్నారన్నారు. కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని సూచించారు.