యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని తెరాస నేతలు దర్శించుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు నేతలు తెలిపారు.
'లక్ష్మీనరసింహ స్వామి... కేటీఆర్‌ను చల్లగా చూడండి' - minister ktr latest news
తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని తెరాస నేతలు దర్శించుకున్నారు. తమ నాయకుడిని చల్లగా చూడాలని స్వామిని వేడుకున్నారు.
!['లక్ష్మీనరసింహ స్వామి... కేటీఆర్‌ను చల్లగా చూడండి' 'లక్ష్మీనరసింహ స్వామి... కేటీఆర్‌ను చల్లగా చూడండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8156547-867-8156547-1595602200838.jpg)
'లక్ష్మీనరసింహ స్వామి... కేటీఆర్‌ను చల్లగా చూడండి'
రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని.. తెలంగాణలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్వామివారికి వేడుకున్నట్లు స్థానిక ప్రజాప్రతినిధులు, యాదగిరిగుట్ట మున్సిపల్ ఛైర్మన్ సుధా, వైస్ ఛైర్మన్ కాటంరాజు, కాట బత్తిని ఆంజనేయులు, కర్రె వెంకటయ్య, మిట్ట వెంకటయ్య, తదితరులు ఉన్నారు.